న్యూ ఏజ్‌ ఫిల్మ్‌ లవ్‌ మీ

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:58 AM

ఆశిష్‌, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రానికి ‘లవ్‌ మీ’ అనే టైటిల్‌ నిర్ణయించారు. ‘ఇఫ్‌ యు డేర్‌’ అనేది ఉప శీర్షిక. దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బేనర్‌పై అరుణ్‌ భీమవరపు దర్శకత్వంలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు...

న్యూ ఏజ్‌ ఫిల్మ్‌ లవ్‌ మీ

ఆశిష్‌, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రానికి ‘లవ్‌ మీ’ అనే టైటిల్‌ నిర్ణయించారు. ‘ఇఫ్‌ యు డేర్‌’ అనేది ఉప శీర్షిక. దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బేనర్‌పై అరుణ్‌ భీమవరపు దర్శకత్వంలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. టైటిల్‌ ప్రకటించిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దిల్‌ రాజు మాట్లాడుతూ ‘ ఇదొక న్యూ ఏజ్‌ ఫిల్మ్‌. ‘ఆర్య’ కథ విని ఎలా ఎగ్జయిట్‌ అయ్యానో ఈ చిత్ర కథ విని అదే అనుభూతి పొందాను. ఈ సినిమా ప్రారంభం కావడానికి కారణం నాగ మల్లిడి. అతను నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఓ స్ర్కిప్ట్‌ వినండి.. ఫ్రెండ్‌తో కలసి తయారు చేశానని నాగ చెబితే కథ విన్నాను. నాకు నచ్చడంతో చాలా మందికి చెప్పాను. అందరూ ఎగ్జైట్‌ అయ్యారు. ఇలా స్ర్కిప్ట్‌ దశలో ఎగ్జైట్‌ అవడం అరుదుగా జరుగుతుంటుంది. హీరోగా ఆశిష్‌ కావాలని అడిగారు. అలాగే హర్షిత్‌, హన్షితలను ఇవ్వమని నాగ అడిగాడు. స్ర్కిప్ట్‌ పూర్తయాక టెక్నిషియన్ల పేరు చెబితే భయం వేసింది. అయినా ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్‌నీ, కీరవాణిగారిని కలసి కథ చెప్పి ఒప్పించారు. ఫిబ్రవరి 27న టైటిల్‌ అనౌన్స్‌ చేశాం. ఏప్రిల్‌ 27న సినిమా విడుదల చేయబోతున్నాం.‘ఆర్య’ విషయంలో నాకు జరిగిందే ఈ టీమ్‌కు జరగబోతోందనే వైబ్స్‌ వస్తున్నాయి’ అన్నారు. చిత్ర కథానాయిక వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ‘ఈ మూవీ నాకు ప్రత్యేకం. ఇలాంటి స్టోరీ లైన్‌ ఎక్కడా చూడలేదు. త్వరలో టీజర్‌ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా చూశాక డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌తో ప్రేక్షకులు బయటకు వస్తారు’ అని చెప్పారు.

Updated Date - Feb 28 , 2024 | 03:58 AM