కన్నప్ప కోసం నెమలి
ABN , Publish Date - Dec 31 , 2024 | 02:02 AM
మంచు విష్ణు టైటిల్ పాత్ర పోషిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది సోమవారం ప్రకటించారు. ఇందులో చెంచు రాణి నెమలిగా నటిస్తున్న ప్రీతి ముకుందన్ ఫస్ట్ లుక్ విడుదల...
మంచు విష్ణు టైటిల్ పాత్ర పోషిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది సోమవారం ప్రకటించారు. ఇందులో చెంచు రాణి నెమలిగా నటిస్తున్న ప్రీతి ముకుందన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ‘అందంలో సహజం. తెగింపులో సాహసం, ప్రేమలో అసాధారణం.. భక్తిలో పారవశ్యం.. కన్నప్పకు సర్వస్వం’ అంటూ నెమలి పాత్రను పరిచయం చేశారు. తమిళనాడులోని తిరుచ్చికి చెందిన ప్రీతి భరతనాట్యంలో ప్రసిద్ధురాలు. డాక్టర్ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదలవుతుంది.