‘నీ దారే నీ కథ’

ABN , Publish Date - Mar 21 , 2024 | 05:42 AM

వంశీ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో నూతన నటీనటులతో నిర్మిస్తున్న చిత్రం ‘నీ దారే నీ కథ’. మ్యూజికల్‌ బ్యాక్‌ డ్రాప్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రియతమ్‌ మంతిని, విజయ విక్రాంత్‌, అనంత పద్మసోల...

‘నీ దారే నీ కథ’

వంశీ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో నూతన నటీనటులతో నిర్మిస్తున్న చిత్రం ‘నీ దారే నీ కథ’. మ్యూజికల్‌ బ్యాక్‌ డ్రాప్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రియతమ్‌ మంతిని, విజయ విక్రాంత్‌, అనంత పద్మసోల, వేద్‌, అంజన బాలాజీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సురేశ్‌, అజయ్‌, కల్యాణీ నటరాజన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. వంశీ జొన్నలగడ్డ, తేజేష్‌ వీర, శైలజ జొన్నలగడ్డ నిర్మించారు. బుధవారం ఈ చిత్రం టీజర్‌ను సీనియర్‌ జర్నలిస్టులు ప్రభు, లక్ష్మీనారాయణ, సురేశ్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘‘ఎంతోమంది సింక్‌ సౌండ్‌ రిస్క్‌ అంటున్నా.. సింక్‌ సౌండ్‌ పద్ధతితోనే హాలీవుడ్‌ స్టాండర్డ్స్‌కి ఏ మాత్రం తగ్గకుండా చిత్రీకరించాం. ఇందులో కథతో పాటూ సాగే మ్యూజిక్‌ ఒక మంచి సినిమాటిక్‌ ఫీల్‌ను అందిస్తుంది. అనుకున్నది సాధించడం కోసం నలుగురు యువకులు చేసే ప్రయత్నాల్ని అందర్నీ ఆకట్టుకునేలా, ఎంతో ఆసక్తికరంగా మలిచాం’’ అని చెప్పారు. నిర్మాత తేజేష్‌ మాట్లాడుతూ ‘‘ఇది మా మొదటి సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా చాలా కొత్తగా మీ ముందుకు తీసుకొస్తున్నాం’’ అని అన్నారు. నిర్మాత శైలజ జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘‘సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాం. మంచి టెక్నికల్‌ వాల్యూ్‌సతో మ్యూజిక్‌ బ్యాక్‌ డ్రాప్‌తో యువతను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది. బుడాపెస్ట్‌ లో చేసిన మ్యూజిక్‌ ఆర్కెస్ర్టా థీమ్‌ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: విపిన్‌ సామ్యూల్‌, సంగీతం: ఆల్బర్ట్టో గురియోలి.

Updated Date - Mar 21 , 2024 | 05:42 AM