Tollywood Box Office: రానున్న రెండు వారాల్లో చిన్న సినిమాలాదే హవా !

ABN , Publish Date - Apr 15 , 2024 | 01:04 PM

రానున్న వారాల్లో సుమారు డజనుకుపైగా చిన్న చిత్రాలు విడుదలవుతున్నాయి. ఇందులో దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి, నవదీప్ నటించిన 'లవ్ మౌళి', నారా రోహిత్ రాజకీయ నేపధ్య చిత్ర 'ప్రతినిధి 2' వున్నాయి. ఇంకా చాలా అనువాద చిత్రాలు కూడా విడుదలవుతున్నాయి

Tollywood Box Office: రానున్న రెండు వారాల్లో చిన్న సినిమాలాదే హవా !
Some of the small films are ready to hit the screens in the coming two weeks

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఇప్పుడు చాలా డల్ గా నత్తనడకలా సాగుతోంది. నిన్న ఆదివారం, మొన్న శనివారం ఇంతకు ముందు విడుదలైన సినిమాలు అంటే 'టిల్లు స్క్వేర్', 'మంజుమ్మల్ బాయ్స్' ఈ రెండూ కలెక్షన్ల పరంగా పరవాలేదు అనిపించింది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'ఫామిలీ స్టార్' డిజాస్టర్ అని ట్రేడ్ పండితులు ఖరారు చేశారు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కలెక్షన్స్, ఈ సినిమా కన్నా ముందు విడుదలైన 'టిల్లు స్క్వేర్' కన్నా చాలా తక్కువ ఉండటం ఆసక్తికరం.

Paarijatha Parvam.jpg

అలాగే మలయాళం సినిమా 'మంజుమ్మల్ బాయ్స్' అనువాదం చేసి తెలుగులో అదే పేరుతో విడుదల చేశారు, ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగున్నాయి. ఇక అంజలి నటించిన 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమా ఫ్లాపు అని టాక్ వచ్చింది. ఈ సినిమా కలెక్షన్స్ కూడా ఆదివారం నాడు అసలు ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయి అంటే, మిగతా రోజుల్లో ఇక నడవటం కష్టం అని ట్రేడ్ పండితులు అంటున్నారు.

ఇక రానున్న రెండు వారాల్లో కూడా పెద్ద సినిమాలు ఏవీ కూడా విడుదలవడం లేదు. చిన్న సినిమాలు చాలా ఏప్రిల్ 19, ఏప్రిల్ 25, 26 తేదీల్లో విడుదల చేస్తున్నారు. ఇందులో కొన్ని సినిమాలే కొంచెం పేరున్న సినిమాలని, వీటి ప్రభావం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉంటుందో చూడాలని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. చైతన్య రావు, సునీల్, శ్రద్ధ దాస్ నటించిన 'పారిజాత పర్వం' సినిమా ఏప్రిల్ 19న విడుదలవుతోంది. కంభంపాటి సంతోష్ దీనికి దర్శకుడు. అలాగే చాలా కాలం తరువాత నవదీప్ కథానాయకుడిగా చేస్తున్న సినిమా 'లవ్ మౌళి'. ఈ సినిమాకోసమని నవదీప్ ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో చాలా పట్టణాలు తిరిగి ఈ సినిమా కోసం ప్రచారం చేశారు.

lovemeifyoudare.jpg

'లవ్ మౌళి' ఏప్రిల్ 19న విడుదలవుతోంది. అలాగే క్రైమ్ థ్రిల్లర్ 'టేనంట్' కూడా ఈవారం విడుదలవుతోంది. సత్యం రాజేష్, ఎస్తర్, మేఘ చౌదరి, చందన నటించిన ఈ సినిమాకి యుగంధర్ దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదలవుతోంది. వీటితో పాటు చాలా చిన్న సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ప్రేక్షకులు ఇప్పుడు థియేటర్స్ కి రావటం చాలా తగ్గిపోయింది, సినిమా మరీ విశేషమైనదిగా చెప్పబడితే చూడటానికి వస్తున్నారు తప్ప మామూలుగా అయితే రావటం లేదు. టికెట్స్ రేట్ ఎక్కువవడం, మల్టీ ప్లెక్స్ లలో తిను భండారాల ఖరీదు కూడా మధ్యతరగతి కుటుంబాలు తట్టుకోలేనంత ఎక్కువ ధరలు ఉండటం వీటికి కారణం అని అంటున్నారు.

అలాగే దిల్ రాజు తన సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి సినిమా 'లవ్ మీ' కూడా వచ్చే వారం అంటే ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నారు. ఇందులో ఆశిష్ రెడ్డి సరసన 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తోంది. ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించటం ఆసక్తికరం. అలాగే నారా రోహిత్ నటించిన రాజకేయ నేపధ్యం వున్న చిత్రం 'ప్రతినిధి 2' కూడా ఏప్రిల్ 25న విడుదలవుతోంది. ఇలా చాలా చిన్న సినిమాలు రానున్న రెండు వారాల్లో ఒక డజనుకు పైగా విడుదలవుతున్నాయి. వీటిలో ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో చూడాలి.

lovemouli.jpg

రానున్న రెండు వారాల్లో విడుదలవ్వబోయే కొన్ని చిత్రాలు

ఏప్రిల్ 19

టేనంట్ (సత్యం రాజేష్, ఎస్తర్, మేఘా చౌదరి, చందన, దర్శకుడు యుగంధర్)

లవ్ మౌళి (నవదీప్, పంఖురి గిద్వాని, దర్శకుడు అవనీంద్ర)

పారిజాత పర్వం (చైతన్య రావు, సునీల్, శ్రద్ధ దాస్, వైవా హర్ష, దర్శకుడు కంభంపాటి సంతోష్)

సశివదనే (రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్. దర్శకుడు మోహన్ ఉబ్బర)

శరపంజరం (నవీన్ కుమార్ గట్టు, లయ దర్శకుడు నవీన్ కుమార్)

తెప్ప సముద్రం (బిగ్ బాస్ ఫేం అర్జున్ అంబటి, కిశోరి దాత్రక్, రవిశంకర్, చైతన్య రావు. దర్శకుడు సతీష్ రాపోలు)

ఏప్రిల్ 25

లవ్ మీ (ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య, దర్శకుడు అరుణ్ భీమవరపు)

ప్రతినిధి 2 (నారా రోహిత్ దర్శకుడు మూర్తి దేవగుప్తపు)

ఏప్రిల్ 26

బాక్ (సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా, వెన్నెల కిశోర్, దర్శకుడు సుందర్ సి)

సీతాకల్యాణ వైభోగమే (సుమన్ తేజ్, గరిమ చౌహాన్, దర్శకుడు సతీష్ పరమవేద)

రత్నం (విశాల్, ప్రియా భవానీ శంకర్ దర్శకుడు హరి)

Updated Date - Apr 15 , 2024 | 01:05 PM