scorecardresearch

Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ టైటిల్ టీజర్ ఎలా ఉందంటే..

ABN , Publish Date - Nov 15 , 2024 | 12:37 PM

కార్తీక పౌర్ణమి శుభదినాన నందమూరి నటసింహం బాలయ్య నటిస్తోన్న 109వ చిత్ర టైటిల్ టీజర్‌ని మేకర్స్ వదిలారు. ‘డాకు మహారాజ్’ పేరుతో వదిలిన ఈ టీజర్ సినిమాపై భారీ హైప్‌ని ఎక్కిస్తోంది. ఈ టీజర్ ఎలా ఉందంటే..

Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ టైటిల్ టీజర్ ఎలా ఉందంటే..
Daaku Maharaaj Movie Still

నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘NBK109’. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 109వ చిత్రమిది. తన నటవిశ్వరూపంతో ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న బాలకృష్ణ, మరో అద్భుతమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Also Read- Breaking News: బాలయ్యకి పద్మ భూషణ్.. విషయం ఏమిటంటే


ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రచార చిత్రాలు సైతం సినిమాపై ఎక్కడా లేని క్రేజ్‌ని పెంచేశాయి. ఇక ఇప్పుడు అందరూ ఎంతగానో ఎదుచూస్తున్న ఈ చిత్ర టైటిల్‌ టీజర్ విడుదలైంది. కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా చిత్ర టైటిల్‌ని ప్రకటించడంతో పాటు, టీజర్‌ను కూడా విడుదల చేశారు నిర్మాతలు. ఈ సినిమాకి ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) అనే శక్తివంతమైన టైటిల్‌ను పెట్టారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో ఈ టీజర్ విడుదల కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకుడు బాబీ కొల్లి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు ఎస్. తమన్ హాజరయ్యారు. ఇక ఈ టీజర్ ఎలా ఉందంటే..


Daaku-Maharaj.jpg

‘‘96 సెకన్ల నిడివితో ఉన్న ఈ ‘డాకు మహారాజ్’ టీజర్.. సినిమాపై మరింతగా అంచనాలను పెంచేస్తోంది. ‘ఈ కథ వెలుగును పంచే దేవుళ్లది కాదు. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులని ఆడించే రావణుడిదీ కాదు. ఈ కథ.. రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది’ అంటూ ‘డాకు మహారాజ్’గా బాలకృష్ణను పరిచయం చేసిన తీరు అదిరిపోయింది. మునుపెన్నడూ చూడని సరికొత్త రూపంలో గుర్రంపై బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. టీజర్‌లోని ప్రతి ఫ్రేమ్ భారీతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. విజువల్స్, తమన్ నేపథ్య సంగీతం టీజర్‌ని మరోస్థాయికి తీసుకెళ్లాయి. మొత్తానికి టీజర్ చూస్తుంటే, బాలయ్యతో మరో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌కి బాబీ శ్రీకారం చుట్టబోతున్నాడని అనిపిస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

Also Read-Kanguva Review: సూర్య నటించిన యాక్షన్ డ్రామా ‘కంగువా’ ఎలా ఉందంటే...

Also Read-Matka Review: 'మట్కా'తో వరుణ్‌ తేజ్‌ హిట్‌ కొట్టాడా...

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 15 , 2024 | 12:37 PM