చిక్కులు తెచ్చిపెట్టిన నయన్‌ అన్నపూరణి

ABN , Publish Date - Jan 12 , 2024 | 05:34 AM

ఇటీవలే ఓటీటీ స్ట్రీమింగ్‌ మొదలైన నయనతార రీసెంట్‌ మూవీ ‘అన్నపూరణి’ని ఉన్నట్టుండి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నుంచి తొలిగించారు. స్వయంగా ఆ చిత్ర నిర్మాణసంస్థ అయిన జీ స్టూడియోస్‌ ఈ నిర్ణయం తీసుకుంది...

చిక్కులు తెచ్చిపెట్టిన నయన్‌ అన్నపూరణి

నెట్‌ఫ్లిక్స్‌ నుంచి తొలగింపు

ఇటీవలే ఓటీటీ స్ట్రీమింగ్‌ మొదలైన నయనతార రీసెంట్‌ మూవీ ‘అన్నపూరణి’ని ఉన్నట్టుండి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నుంచి తొలిగించారు. స్వయంగా ఆ చిత్ర నిర్మాణసంస్థ అయిన జీ స్టూడియోస్‌ ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ‘అన్నపూరణి’ థియేటర్లలో కూడా పెద్దగా ఆడలేదు. థియేటర్లలో మిశ్రమ స్పందనతో నిర్మాతకు నష్టాలే తెచ్చిపెట్టింది. రీసెంట్‌గా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేశారు. అసలు చిక్కు ఇక్కడే వచ్చింది. కథ ప్రకారం ఇందులోని కొన్ని సన్నివేశాలు మత విశ్వాసాలను భంగపరిచేలా ఉన్నాయని పలువురు అభ్యంతరాలు వెలిబుచ్చారు. నయన్‌తోపాటు చిత్రబృందంపై మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌, ముంబైలో కేసులు నమోదయ్యాయి. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌ ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌ నుంచి తొలగించింది. మతవిశ్వాసాలను కించపరిచే ఉద్దేశం తమకు లేదని, తమకు అన్ని మతాలూ సమానమేనని, ఈ విషయంలో తెలిసిగానీ, తెలియకగానీ ఎవర్నయినా బాధపెట్టి ఉంటే క్షమించాలని జీ స్టూడియోస్‌ వివరణ ఇచ్చుకుంది. ‘అగ్నిహోత్రం లాంటి సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి, చెఫ్‌ కావాలనే తన కోరికను ఎలా సాకారం చేసుకుంది? అనే ప్రశ్నకు సమాధానమే ‘అన్నపూరణి’ కథ. నయనతార టైటిల్‌రోల్‌ పోషించిన ఈ చిత్రంలో సత్యరాజ్‌, జై కీలక పాత్రలు పోషించారు. నీలేశ్‌ కృష్ణ దర్శకుడు.

Updated Date - Jan 12 , 2024 | 05:34 AM