నటరత్నాల క్రైమ్‌ కామెడీ..

ABN , Publish Date - Jan 22 , 2024 | 12:59 AM

ఇయన సల్తానా, సుదర్శన్‌రెడ్డి, ‘రంగస్థలం’ మహేశ్‌, తాగుబోతు రమేశ్‌ ప్రఽధానపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘నటరత్నాలు’. శివనాగు ఈ చిత్రానికి దర్శకుడు. చంటి యాలమాటి నిర్మాత...

నటరత్నాల క్రైమ్‌ కామెడీ..

ఇయన సల్తానా, సుదర్శన్‌రెడ్డి, ‘రంగస్థలం’ మహేశ్‌, తాగుబోతు రమేశ్‌ ప్రఽధానపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘నటరత్నాలు’. శివనాగు ఈ చిత్రానికి దర్శకుడు. చంటి యాలమాటి నిర్మాత. ఈ సినిమా ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు. ‘క్రైమ్‌ కామెడీ థ్ర్లిరర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని పంచుతుంది. సినిమా తీయాలనే ఆశతో పరిశ్రమకు వచ్చినవాళ్లు ఎలా విఫలమవుతున్నారు? ఎలా సఫలమవుతున్నారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. అడిగినవన్నీ సమకూర్చిన నిర్మాతకు, అన్ని విధాలా సహకరించిన యూనిట్‌ సభ్యులకూ థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నాను’ అని దర్శకుడు శివనాగు అన్నారు. సినిమా విజయం పట్ల నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన నిర్మాతలు దామోదరప్రసాద్‌, టి.ప్రసన్నకుమార్‌, డి.ఎ్‌స.రావు, రామసత్యనారాయణ దర్శకులు కె.ఎ్‌స.రవికుమార్‌చౌదరి, సముద్ర కూడా మాట్లాడారు.

Updated Date - Jan 22 , 2024 | 12:59 AM