నరకాసుర వధకై సమరం

ABN , Publish Date - Jul 21 , 2024 | 01:46 AM

నాని కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’. డి.వి.వి దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. సాయికుమార్‌, ఎస్‌జే సూర్య ముఖ్యపాత్రల్లో...

నాని కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’. డి.వి.వి దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. సాయికుమార్‌, ఎస్‌జే సూర్య ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శనివారం సూర్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం ఆయన పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. పోలీసాఫీసర్‌గా ఆయన క్రౌర్యాన్ని పలికించిన తీరు ఆకట్టుకుంది. సూర్య పాత్రను నరకాసురుడితో పోల్చుతూ, అతన్ని ఎదుర్కోవడానికి వస్తున్న హీరో హీరోయిన్ల పాత్రలను శ్రీకృష్ణుడు, సత్యభామతో పోల్చిచూపడం ఆసక్తిని పెంచింది. ఆగస్టు 29న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. సంగీతం: జేక్స్‌ బిజోయ్‌, సినిమాటోగ్రఫీ: మురళీ జీ, ఎడిటర్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌

Updated Date - Jul 21 , 2024 | 01:46 AM