భారీ సెట్‌లో నాని పోరాటాలు

ABN , Publish Date - May 15 , 2024 | 12:34 AM

ఇంతకుముందెన్నడూ పోషించని పవర్‌ ప్యాక్డ్‌ పాత్రలో నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది, హై బడ్జెట్‌తో...

భారీ సెట్‌లో నాని పోరాటాలు

ఇంతకుముందెన్నడూ పోషించని పవర్‌ ప్యాక్డ్‌ పాత్రలో నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది, హై బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాకు వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పతాక సన్నివేశాల కోసం ఓ భారీ సెట్‌ వేశారు. ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్‌ జె సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 29న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి చెప్పారు.

Updated Date - May 15 , 2024 | 12:34 AM