మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గీతామాధురి, నందు కుమారుడి బార‌సాల‌.. ఎన్టీఆర్ పేరు వ‌చ్చేలా నామ‌క‌ర‌ణం

ABN, Publish Date - Mar 04 , 2024 | 02:14 PM

సింగ‌ర్ గీతామాధురి తెలుగునాట ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఈ మ‌ధ్యే ఆమె మ‌రోమారు త‌ల్లి అయిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా నందు, గీతామాధురిల జంట త‌మ‌ కుమారుడికి పెట్టిన పేరు బాగా వైర‌ల్ అవుతోంది.

Geetha Madhuri

సింగ‌ర్ గీతామాధురి (Geetha Madhuri) తెలుగునాట ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. త‌న హ‌స్కీ వాయిస్‌తో పాడిన పాట‌లు ఎన్నో అభిమానుల నోట నిత్యం ఎక్క‌డోచోటా నానుతూనే ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి.

2014లో న‌టుడు నందు (Nandu)ను పెళ్లి చేసుకున్న ఆమె త‌ర్వాత ఎక్కువ‌గా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. 2019లో ఫ‌స్ట్ ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఆ పాప‌కు దాక్షాయ‌ణి ప్ర‌కృతి (Dakshayani Prakruthi) అని పేరు పెట్టారు.

ఇదిలాఉండ‌గా ఈ మ‌ధ్యే గీతామాధురి మ‌రోమారు త‌ల్లి అయిన విష‌యం తెలిసిందే. ఇదే విష‌యాన్ని ‘ఫిబ్రవరి 10న మాకు కొడుకు పుట్టాడు.. మా జీవితాల్లోకి ఆనందం తెచ్చాడు..’ అంటూ నందు (Nandu) సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ క్ర‌మంలో రెండు రోజుల క్రితం నందు, గీతా మాధురి (Geetha Madhuri) జంట త‌మ‌ కుమారుడికి బార‌సాల, నామ‌క‌ర‌ణం కూడా నిర్వ‌హించారు.


ఈ సంద‌ర్భంగా వారి బాబుకు ఎన్టీఆర్ పేరు క‌లిసొచ్చేలా ‘ధృవధీర్‌ తారక్‌’ (Dhruvadhir Tarak) అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ నుంచి న‌టులు, సింగ‌ర్స్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ కొద్దిమంది ,ఇంకా చాలా మంది సెల‌బ్రిటీస్, బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌ ఈ వేడుక‌కు హ‌జ‌రై వారికి శుభాకాంక్ష‌లు తెలిపారు.

Updated Date - Mar 04 , 2024 | 02:19 PM