Nandamuri Balakrishna : ఎన్నికల వల్ల 50 రోజులు కెమెరాను మిస్సయ్యా

ABN , Publish Date - May 25 , 2024 | 06:18 AM

‘‘దర్శకుడి మనసులో ఉన్న ఊహను ఒడిసిపట్టి దాన్ని తెరపైన అద్భుతంగా ఆవిష్కరించేది కెమెరామెన్‌. మొదట్లో నాకూ కెమెరామెన్‌ అవ్వాలనే కోరిక ఉంది’ అని నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌రోల్‌ పోషించిన చిత్రం ‘సత్యభామ’. సుమన్‌ చిక్కాల

 Nandamuri Balakrishna  : ఎన్నికల వల్ల 50 రోజులు కెమెరాను మిస్సయ్యా

నందమూరి బాలకృష్ణ

‘‘దర్శకుడి మనసులో ఉన్న ఊహను ఒడిసిపట్టి దాన్ని తెరపైన అద్భుతంగా ఆవిష్కరించేది కెమెరామెన్‌. మొదట్లో నాకూ కెమెరామెన్‌ అవ్వాలనే కోరిక ఉంది’ అని నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌రోల్‌ పోషించిన చిత్రం ‘సత్యభామ’. సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. ఈ చిత్రం జూన్‌ 7న విడుదలవుతోంది. శుక్రవారం నిర్వహించిన ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఎన్నికల ప్రచారం వల్ల 50 రోజులు కెమెరాను మిస్సయిన ఫీలింగ్‌ ఉంది. ఇప్పుడు ‘సత్యభామ’ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమానికి రావడంతో ఆ లోటు తీరినట్లు అనిపించింది. ‘సత్యభామ’ పేరులోనే ఒక వైబ్రేషన్‌ ఉంది. మహిళా సాధికారితలో సత్యభామ తరతరాలకూ ఆదర్శం. అంత గొప్ప మహిళ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ అద్భుతంగా నటించారు. తనో ఫైర్‌బ్రాండ్‌. ఒక బిడ్డకు జన్మనిచ్చాక ఆమె ఈ సినిమా చేస్తున్నారు. తల్లయ్యాక హీరోయిన్‌కు పనికిరారు అనే మాటను ఆమె బ్రేక్‌ చేశారు. ఉగాది పచ్చడిలా నవ రసాలను మేళవించి చిత్రబృందం ఈ సినిమాను తెరకెక్కించిందని ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. జూన్‌ 7న విడుదలవుతున్న ‘సత్యభామ’ చిత్రాన్ని ఆదరించండి’ అని ప్రేక్షకులను కోరారు. కాజల్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ‘‘సత్యభామ’ కథ వినగానే భావోద్వేగానికి గురయ్యాను. చాలామంది ప్రతిభావంతులు ఈ సినిమాకు పనిచేశారు. నవీన్‌చంద్ర అద్భుతంగా నటించారు. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలి’ అని కోరారు. చిత్ర సమర్పకుడు శశికిరణ్‌ తిక్క మాట్లాడుతూ ‘కథ వినగానే కాజల్‌ ఓకే చెప్పారు. ఈ సినిమాకు నవీన్‌ చంద్ర ప్రధాన ఆకర్షణ. థ్రిల్‌తో పాటు మంచి ఎమోషన్‌ ఉన్న చిత్రమిది’ అన్నారు. సత్యభామ చాలా మంచి చిత్రం, హిట్‌ కొడతామనే నమ్మకం ఉంది అని నవీన్‌ చంద్ర చెప్పారు. సినిమా పట్ల కాజల్‌ గారికి ఉన్న ప్యాషన్‌ మమ్మల్ని ప్రభావితం చేసింది అని నిర్మాతలు చెప్పారు. సుమన్‌ చిక్కాల మాట్లాడుతూ ‘స్నేహితుడిగా నా కలను నెరవేర్చిన శశికి థాంక్స్‌. అలాగే నా ఫస్ట్‌ హీరో కాజల్‌ అగర్వాల్‌ అని చెబుతున్నందుకు సంతోషంగా ఉంది. ఆమెను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను’ అన్నారు.

Updated Date - May 25 , 2024 | 06:19 AM