బాలకృష్ణ స్వర్ణోత్సవ సభకు అతిరథమహారథులు
ABN , Publish Date - Aug 31 , 2024 | 06:14 AM
నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. సెప్టెంబర్ ఒకటిన నోవాటెల్ హోటల్‌లో ఈ వేడుకలకు
నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. సెప్టెంబర్ ఒకటిన నోవాటెల్ హోటల్‌లో ఈ వేడుకలకు అతిరథమహారథులు హాజరవుతున్నారు. ఇప్పటికే ఎంతో మందికి ఆహ్వానాన్ని అందించారు. ఇంకా కొంతమందికి పిలుపులు వెళ్లలేదని వస్తున్న వార్తలపై శుక్రవారం సాయంత్రం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చింది. కార్యదర్శి దామోదర ప్రసాద్ మాట్లాడుతూ ‘తెలుగు చిత్రపరిశ్రమలోని అన్ని శాఖలు కలసి ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు, కేంద్రమంత్రులు కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. ఇతర భాషల సినీ ప్రముఖులు కూడా వస్తారు. ఫిజికల్‌గా ఎవరికైనా ఇన్విటేషన్ అందకపోయినా ఇదే మా వ్యక్తిగత ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ పాల్గొనాలి’ అని కోరారు. ఈ కార్యక్రమంలో చదలవాడ శ్రీనివాసరావు, సి.కల్యాణ్, మాదాల రవి, భరత్‌భూషణ్, ప్రసన్నకుమార్, శివబాలాజీ, పరుచూరి గోపాలకృష్న, అశోక్‌కుమార్, మాధవపెద్ది సురేశ్, అనిల్‌కుమార్ వల్లభనేని తదితరులు పాల్గొన్నారు.