ఆ వీధికి నాన్న పేరు పెట్టండి

ABN , Publish Date - Sep 24 , 2024 | 02:43 AM

గానగంధర్వుడు, సినీ నేపథ్యగాయకుడు దివంగత ఎస్‌.పి.బాలసుబ్రమణ్యం నివసించిన ్జకామ్‌దార్‌నగర్‌కు ఆయన పేరును పెట్టాలని ఎస్పీబీ తనయుడు, సినీ నేపథ్యగాయకుడు ఎస్పీ .చరణ్‌ కోరారు. ఈ మేరకు ఆయన...

గానగంధర్వుడు, సినీ నేపథ్యగాయకుడు దివంగత ఎస్‌.పి.బాలసుబ్రమణ్యం నివసించిన ్జకామ్‌దార్‌నగర్‌కు ఆయన పేరును పెట్టాలని ఎస్పీబీ తనయుడు, సినీ నేపథ్యగాయకుడు ఎస్పీ .చరణ్‌ కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం చెన్నై సచివాలయం ప్రాంగణంలో ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ సెల్‌లో వినతిపత్రం సమర్పించారు. ఇందులో.. ‘సంగీత ప్రపంచంలో తన మధురమైన గాత్రంతో కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం జీవించివున్న సమయంలో స్థానిక నుంగంబాక్కంలోని ్జకామ్‌దార్‌నగర్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసివుండేవారు. ప్రస్తుతం ఆయన భౌతికంగా లేకపోవడంతో ఆయనను స్మరించుకునేలా ఎస్పీబీ నివసించిన ్జకామ్‌దార్‌నగర్‌కు ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నగర్‌ లేదా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వీధి’గా నామకరణం చేయాలని కోరుతున్నాను.


ఈ వినతిని పెద్దమనసుతో అంగీకరించి, తమతో పాటు కోట్లాదిమంది ఎస్పీబీ అభిమానుల కోరికను తీర్చాలని కోరుతున్నాం’ అని ఎస్పీ చరణ్‌ కోరారు. కాగా, ఈ నెల 25వ తేదీన ఎస్పీబీ నాలుగో వర్థంతి వేడుకలు జరుగనున్న విషయం తెల్సిందే.

చెన్నై (ఆంధ్రజ్యోతి)

Updated Date - Sep 24 , 2024 | 02:43 AM