నాకు నేనే కొత్తగా అనిపించా

ABN , Publish Date - Mar 08 , 2024 | 02:33 AM

సుహాస్‌ హీరోగా రూపొందుతున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ప్రసన్నవదనం’. పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌ కథానాయికలు. డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడు అర్జున్‌ వై.కె. దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కె.ఎ్‌స.మణికంఠ, టి.ఆర్‌.ప్రసాద్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు...

నాకు నేనే కొత్తగా అనిపించా

సుహాస్‌ హీరోగా రూపొందుతున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ప్రసన్నవదనం’. పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌ కథానాయికలు. డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడు అర్జున్‌ వై.కె. దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కె.ఎ్‌స.మణికంఠ, టి.ఆర్‌.ప్రసాద్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం జరిగిన టీజర్‌ రిలీజ్‌ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న దర్శకుడు సాయిరాజేశ్‌ మాట్లాడుతూ ‘సుహా్‌సకి చాలా కీలకమైన సినిమా ఇది. కథలోని పాయింట్‌ అదిరిపోయింది. టీజర్‌ చాలా బాగుంది. తప్పకుండా హిట్‌ అవుతుంది’ అన్నారు. హీరో సుహాస్‌ మాట్లాడుతూ ‘ఫేస్‌ బ్లైండ్‌ నెస్‌ మీద తీస్తున్న మంచి థ్రిల్లర్‌ ఇది. బాగా వచ్చింది. ఇందులో నాకు నేనే కొత్తగా అనిపించాను. నిర్మాతలు మణికంఠ, ప్రసాద్‌ ఎంతో కష్టపడ్డారు. ఇది పక్కాగా బ్లాక్‌బస్టర్‌ అయ్యే సినిమా. అందులో డౌట్‌ లేదు’ అన్నారు. ఈ కథకు సుహాస్‌ యాప్ట్‌ అని దర్శకుడు అర్జున్‌ తెలిపారు. త్వరలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. హీరోయిన్లు పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 02:33 AM