రాజుగారి అమ్మాయితో నాయుడుగారి అబ్బాయి

ABN , Publish Date - Feb 29 , 2024 | 05:05 AM

రవితేజ నున్నా, నేహా జురెల్‌ జంటగా నటించిన ‘రాజుగారి అమ్మాయి- నాయుడుగారి అబ్బాయి’ చిత్రం ట్రైలర్‌ను బుధవారం ప్రసాద్‌ ప్రీవ్యూ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు...

రాజుగారి అమ్మాయితో నాయుడుగారి అబ్బాయి

రవితేజ నున్నా, నేహా జురెల్‌ జంటగా నటించిన ‘రాజుగారి అమ్మాయి- నాయుడుగారి అబ్బాయి’ చిత్రం ట్రైలర్‌ను బుధవారం ప్రసాద్‌ ప్రీవ్యూ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అందరికీ కనెక్ట్‌ అయ్యే టైటిల్‌తో విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రం ఇది. సినిమా విజయం సాధించాలి’ అని కోరారు. నిర్మాతల్లో ఒకరైన ముత్యాల రామదాసు మాట్లాడుతూ ‘ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు కూడా పెద్ద విజయం సాధిస్తున్నాయి. అలాగే ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలతో ‘రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి’ చిత్రం రూపుదిద్దుకుంది. దర్శకుడు సత్యరాజ్‌కు మంచి విజన్‌ ఉంది. ఆయన పెద్ద దర్శకుడు కావాలని కోరుకుంటున్నాను. ఎన్నో సమస్యలు ఎదురైనా ఎక్కడా రాజీపడకుండా తీసిన సినిమా ఇది. మార్చి 9న విడుదల చేస్తున్నాం. సినిమాలో హీరోగా నటించిన కొత్త నటుడు రవితేజ పెద్ద హీరోగా ఎదగాలి’ అన్నారు. ‘ముత్యాల రామదాసుగారు మా వెనుక ఉండి ఈ సినిమాను విజయవంతంగా పూర్తి చేయించారు. మా అమ్మ నున్నా కుమారిగారు లేకపోతే ఈ ప్రాజెక్ట్‌ కంప్లీట్‌ అవదు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. అందరినీ ఆకట్టుకొనే చిత్రం అవుతుంది’ అన్నారు రవితేజ. ఈ చిత్రనిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ దర్శకుడు సత్యరాజ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Feb 29 , 2024 | 05:05 AM