నాగులాపురం నాగమ్మ

ABN , Publish Date - Jul 10 , 2024 | 01:24 AM

మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్‌ ఇండియా పీరియాడికల్‌ డ్రామా ‘ఆది పర్వం’. శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్‌ నోరోనా, శ్రీజిత ఘోష్‌, సుహాసిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంజీవ్‌ మేగోటి దర్శకత్వంలో...

మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్‌ ఇండియా పీరియాడికల్‌ డ్రామా ‘ఆది పర్వం’. శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్‌ నోరోనా, శ్రీజిత ఘోష్‌, సుహాసిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంజీవ్‌ మేగోటి దర్శకత్వంలో ఎమ్‌.ఎ్‌స.కె.రచన నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా సాంగ్‌ను మేకర్స్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా సంజీవ్‌ మేగోటి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో మంచు లక్ష్మీ ‘నాగులాపురం నాగమ్మ’గా నటిస్తున్నారు. ఆ పాత్రలో ఆమె నట విశ్వరూపం చూస్తారు. ఆమె చేసిన యాక్షన్‌ సీక్వెన్సులు సినిమాకే హైలైట్‌’’ అని చెప్పారు. ‘‘ఆదిపర్వం’ మీ అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అని మంచు లక్ష్మీ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: పవన్‌ శేఖర్‌ పసువులేటి, సినిమాటోగ్రఫీ: ఎన్‌.ఎన్‌.హరీశ్‌, సంగీతం: మాధవ్‌ సైబా, సంజీవ్‌ మేగోటి, బి.సుల్తాన్‌ వలి, ఓపెన్‌ బనానా, లుబెక్‌ లీ మార్విన్‌.

Updated Date - Jul 10 , 2024 | 01:24 AM