అభిమానితో నాగ్‌ సెల్ఫీ

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:18 AM

ఇటీవలే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఓ అభిమాని నాగార్జునను కలిసేందుకు ప్రయత్నించగా, సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పక్కకు నెట్టేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. విమర్శలు రావడంతో ఆ సంఘటనపై నాగార్జున...

అభిమానితో నాగ్‌ సెల్ఫీ

ఇటీవలే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఓ అభిమాని నాగార్జునను కలిసేందుకు ప్రయత్నించగా, సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పక్కకు నెట్టేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. విమర్శలు రావడంతో ఆ సంఘటనపై నాగార్జున విచారం వ్యక్తం చేశారు. ఆ అభిమానికి ఎక్స్‌ వేదికగా క్షమాపణలు చెప్పారు. బుధవారం నాగార్జున ఎయిర్‌పోర్ట్‌లో ఆ అభిమానిని కలిశారు. సెక్యూరిటీ సిబ్బంది పక్కకు నెట్టివేసిన సంఘటన ఆ రోజు తనకు తెలియదని అతనితో చెప్పారు. ఆ అభిమానిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. అతనితో కొంత సమయం గడిపి, ఫొటోలు దిగారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. జరిగిన సంఘటన పట్ల మీ ప్రవర్తన హుందాగా ఉంది, ‘మీరు రియల్‌ హీరో సార్‌’ అంటూ నెటిజన్లు నాగార్జునను అభినందిస్తున్నారు.

Updated Date - Jun 27 , 2024 | 12:18 AM