సమాజానికి ఉపయోగపడే ‘మైరా’

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:12 AM

కన్నడంలో గుర్తింపు పొందిన స్మైల్‌ శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పాన్‌ ఇండియా చిత్రం ‘మైరా’. చిన్న జీయర్‌ స్వామిని కలసి చిత్రం స్ర్కిప్ట్‌కు పూజ చేయించి వారి ఆశీస్సులు తీసుకున్నారు...

సమాజానికి ఉపయోగపడే ‘మైరా’

కన్నడంలో గుర్తింపు పొందిన స్మైల్‌ శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పాన్‌ ఇండియా చిత్రం ‘మైరా’. చిన్న జీయర్‌ స్వామిని కలసి చిత్రం స్ర్కిప్ట్‌కు పూజ చేయించి వారి ఆశీస్సులు తీసుకున్నారు శ్రీను. ప్రకృతికి విరుద్దంగా జీవిస్తూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ప్రస్తుత సమాజానికి మైరా లాంటి చిత్రాలు ఎంతో అవసరం అని చిన్న జీయర్‌ స్వామి చెప్పారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ ‘తెలుగులో ఈ సినిమా తీసి కన్నడంలోకి డబ్‌ చేస్తాం. ఓ స్టార్‌ హీరోయిన్‌ ఇందులో నటిస్తారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని చెప్పారు. స్వామిజీ ఆశీస్సులు లభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 05:12 AM