నా టాలెంట్‌ కారణం కాదు

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:22 AM

అడుగుపెట్టిన ప్రతి చోటా విజయఢంకా మోగించడం అంత ఈజీ కాదు. కానీ రష్మిక అది సాధ్యమని నిరూపిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో పాటు హిందీలో క్రేజీ ప్రాజెక్ట్స్‌ కూడా చేస్తూ హిట్లు తన సొంతం...

నా టాలెంట్‌ కారణం కాదు

అడుగుపెట్టిన ప్రతి చోటా విజయఢంకా మోగించడం అంత ఈజీ కాదు. కానీ రష్మిక అది సాధ్యమని నిరూపిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో పాటు హిందీలో క్రేజీ ప్రాజెక్ట్స్‌ కూడా చేస్తూ హిట్లు తన సొంతం చేసుకున్నారు. విక్కీ కౌశల్‌ సరసన నటిస్తున్న ‘ఛావా’ అనే హిందీ చిత్రాన్ని పూర్తి చేశారు రష్మిక. ‘పుష్ప2’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అలాగే ధనుష్‌, నాగార్జున నటిస్తున్న చిత్రంలోనూ కథానాయికగా నటిస్తున్నారు. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం ‘గర్ల్‌ఫ్రెండ్‌’లో నటిస్తున్నారు. నేడు రష్మిక పుట్టినరోజు. కథానాయికగా తన ప్రయాణం గురించి మాట్లాడుతూ ‘విభిన్న భాషల్లో కథానాయికగా ప్రేక్షకులను మెప్పించగల అవకాశం దక్కుతుందనీ, కెరీర్‌ ఆరంభంలో అస్సలు అనుకోలేదు. నా టాలెంట్‌ దీనికి కారణం అనుకోను. ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నా నాకు మాత్రమే ఇంత గొప్ప ఆదరణ దక్కడానికి అవకాశాలే కారణం. నా కష్టంతో పాటు మంచి పాత్రలు సృష్టించిన రచయితలు, దర్శకుల వల్లే ఇది సాధ్యమైంది’ అన్నారు రష్మిక.

Updated Date - Apr 05 , 2024 | 03:22 AM