నా నల్లా కలువా పువ్వా

ABN , Publish Date - Mar 25 , 2024 | 03:54 AM

చైతన్యారావు, అర్జున్‌ అంబటి హీరోలుగా కిశోర్‌ దాత్రి కథానాయికగా నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీశ్‌ రాపోలు దర్శకత్వంలో నీరుకంటి మంజులా రాఘవేందర్‌ గౌడ్‌ నిర్మించారు...

నా నల్లా కలువా పువ్వా

చైతన్యారావు, అర్జున్‌ అంబటి హీరోలుగా కిశోర్‌ దాత్రి కథానాయికగా నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీశ్‌ రాపోలు దర్శకత్వంలో నీరుకంటి మంజులా రాఘవేందర్‌ గౌడ్‌ నిర్మించారు. ఏప్రిల్‌ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘నా నల్లా కలువా పువ్వా’ అంటూ సాగే గీతాన్ని చిత్రబృందం ఆదివారం విడుదల చేసింది. అత్యాచారాలకు గురవుతున్న అమ్మాయిల కుటుంబాల్లోని ఆవేదనను ఈ పాటలో మనసును కదిలించేలా చూపించారు. పెంచల్‌దాస్‌ సాహిత్యం అందిస్తూ, ఆలపించిన ఈ గీతానికి పి. ఆర్‌ స్వరాలు సమకూర్చారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘సతీశ్‌ చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. మంచి అవుట్‌పుట్‌ వచ్చింది’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మా నిర్మాత సహకారం వల్ల సినిమాను అనుకున్న విధంగా తీయగలిగాను. ప్రేక్షకులు మెచ్చే మంచి కమర్షియల్‌ చిత్రం అవుతుంది’ అన్నారు.

Updated Date - Mar 25 , 2024 | 03:54 AM