నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది

ABN , Publish Date - May 27 , 2024 | 01:16 AM

మహేశ్‌ బాబు తనయుడు గౌతమ్‌ కృష్ణ అమెరికాలోని న్యూయార్క్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గ్యాడ్యుయేషన్‌ డే కార్యక్రమంలో మహేశ్‌ బాబు, నమ్రతా శిరోద్కర్‌, సితార పాల్గొన్నారు...

నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది

మహేశ్‌ బాబు తనయుడు గౌతమ్‌ కృష్ణ అమెరికాలోని న్యూయార్క్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గ్యాడ్యుయేషన్‌ డే కార్యక్రమంలో మహేశ్‌ బాబు, నమ్రతా శిరోద్కర్‌, సితార పాల్గొన్నారు. ఈ శుభ సందర్భంలో దిగిన ఫొటోలను మహేశ్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘‘నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. గౌతమ్‌.. నీ గ్రాడ్యుయేషన్‌ కు అభినందనలు. నీ కెరీర్‌లో ఓ నూతన అధ్యాయం మొదలైంది. ఈ చాప్టర్‌ను నువ్వే రాయాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు రియాక్ట్‌ అయిన నమ్రతా.. ‘‘మాటల్లేవ్‌.. ప్రేమ మాత్రమే’’ అని కామెంట్‌ చేశారు.

Updated Date - May 27 , 2024 | 01:16 AM