నా పాత్ర ఎమోషనల్‌గా ఉంటుంది
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:48 AM
‘ఈ సినిమాలో బ్యాంక్ ఉద్యోగిని పాత్ర పోషించాను. అమ్మ, నాన్న ఇద్దరూ బ్యాంకు ఉద్యోగులే కావడంతో నాకు పర్సనల్‌గా ఈ పాత్ర కనెక్ట్ అయింది. సింగిల్ మదర్. స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ ఉన్న పాత్ర. కథ, పాత్ర నచ్చి వెంటనే...
‘ఈ సినిమాలో బ్యాంక్ ఉద్యోగిని పాత్ర పోషించాను. అమ్మ, నాన్న ఇద్దరూ బ్యాంకు ఉద్యోగులే కావడంతో నాకు పర్సనల్‌గా ఈ పాత్ర కనెక్ట్ అయింది. సింగిల్ మదర్. స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ ఉన్న పాత్ర. కథ, పాత్ర నచ్చి వెంటనే ఒప్పుకొన్నా’ అని చెప్పారు నటి అభిరామి. రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన ‘భలే ఉన్నాడే’ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించారు. శుక్రవారం ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో అభిరామి మాట్లాడుతూ ‘తల్లి, కొడుకు అనుబంధం ఈ సినిమాకు సోల్. నా పాత్ర ఎమోషనల్‌గా ఉంటుంది. ఇంతకుముందు కొన్ని సినిమాల్లో నటించి అమెరికా వెళ్లిపోయా. పెళ్లి చేసుకుని కొన్నాళ్లు అక్కడే ఉన్నా. రీ ఎంట్రీలో నేను తెలుగులో మొదట ఒప్పుకొన్నది ‘భలే ఉన్నాడే’ చిత్రాన్నే.’ అని చెప్పారు అభిరామి.