Murali Mohan: 50 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. ఘ‌నంగా మురళీమోహన్ స్వర్ణోత్సవ వేడుక

ABN , Publish Date - Mar 19 , 2024 | 03:18 PM

సీనియర్ నటుడు మురళీ మోహన్ చలన చిత్ర పరిశ్రమలో అడుగిడిగి 50 సంవత్సరాలు పూర్తైన సందర్బాన్ని పురస్కరించుకొని ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలు ఘనంగా సత్కరించాయి.

Murali Mohan: 50 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. ఘ‌నంగా మురళీమోహన్ స్వర్ణోత్సవ వేడుక
murali mohan

సీనియర్ నటుడు మురళీ మోహన్ (Murali Mohan) చలన చిత్ర పరిశ్రమలో అడుగిడిగి 50 సంవత్సరాలు పూర్తైన సందర్బాన్ని పురస్కరించుకొని ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలు ఘనంగా సత్కరించాయి. సంస్థ అధ్యక్ష, కార్యదర్సులు చైతన్య జంగా, వీస్ విజయ్ వర్మ పాకలపాటి, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్, సెక్రటరీ ప్రసన్న కుమార్, వ్యాపార వేత్త కోగంటి సత్యం మరియు 20 మంది యువ కధానాయకుల సమక్షంలో పండితుల వేదమంత్రాల మధ్య మురళీమోహన్‌ (Murali Mohan) ను ఘనంగా సత్కరించారు.

WhatsApp Image 2024-03-19 at 3.05.53 PM.jpeg

ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మురళీ మోహన్ (Murali Mohan) మాట్లాడుతూ.. అట్లూరి పూర్ణచంద్ర‌రావు గారి చేతుల మీదుగా 33వ ఏట కళామతల్లి ఆశీస్సులు పొందిన తాను నటునిగా, వ్యాపార వేత్తగా విజయ వంతంగా రాణించానని, ఈ క్రమంలో తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృజ్ఞతలు తెలుపుకొంటున్నా అన్నారు. ఇదే వేదికపై ఇటీవల జరిగిన ఎన్నికలలో వీరశంకర్ అధ్యక్షుడిగా విజయం సాధించిన తెలుగు దర్శకుల సంఘం కార్యవర్గాన్ని మరియు శుభోదయం సుబ్బారావు నేతృత్వంలో విజయం సాధించిన తెలంగాణ మూవీ టెలివిజన్ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని మురళీ మోహన్ సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.


నిర్మాతల మండలి అధ్యక్ష కార్యదర్సులు దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, ఉపాధ్యక్షులు వశిష్ఠ, తెలంగాణ ఆర్టిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు రాజశేఖర్ తదితరులు మురళీ మోహన్ (Murali Mohan) ఔనత్యాన్ని కొనియాడారు. స్వర్ణోత్సవ వేళ ఓ గొప్ప నటుడిని సత్కరించుకునే అవకాశం రావడంపై చైతన్య జంగా, విజయ్ వర్మ ఆనందం వ్యక్తం చేశారు.

murali-mohan.jpg

రామ్ రావిపల్లి అందించిన ప్రశంసా పత్రం, మిమిక్రి రమేష్ చేసిన ఎంటర్టైన్మెంట్ సభికులను ఎంతగానో ఆకట్టుకొంది. జర్నలిస్టులు ధీరజ్ అప్పాజీ , కూనిరెడ్డి శ్రీనివాస్‌లను మురళీ మోహన్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముంబై నుంచి విచ్చేసిన నటీమణులు దని బోస్, అనీషా ముఖర్జీ, రోజా భారతి, సౌమ్య జాను, ముంతాజ్ తదితర వర్ధమాన నటీమణులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Updated Date - Mar 19 , 2024 | 03:19 PM