ఫిబ్రవరిలో ముఖ్యగమనిక

ABN , Publish Date - Jan 25 , 2024 | 04:40 AM

విరాన్‌ ముత్తంశెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ముఖ్యగమనిక’. లావణ్య ఇందులో కథానాయిక. సినిమాటోగ్రాఫర్‌ వేణు మురళీధర్‌ దర్శకుడు. రాజశేఖర్‌, సాయికృష్ణ నిర్మాతలు...

ఫిబ్రవరిలో ముఖ్యగమనిక

విరాన్‌ ముత్తంశెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ముఖ్యగమనిక’. లావణ్య ఇందులో కథానాయిక. సినిమాటోగ్రాఫర్‌ వేణు మురళీధర్‌ దర్శకుడు. రాజశేఖర్‌, సాయికృష్ణ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్‌ దశలో ఉంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ సింగిల్‌కి, టీజర్‌కీ మంచి స్పందన వస్తోంది. సినిమా అంతకు మించి ఉంటుంది. ఫిబ్రవరి మొదటివారంలో ట్రైలర్‌ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నాం. ప్రముఖ సెలబ్రిటీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే నెల మూడోవారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కిరణ్‌ వెన్న.

Updated Date - Jan 25 , 2024 | 04:40 AM