థ్రిల్లింగ్‌ అంశాలతో ముఖ్య గమనిక.. టీజర్ వదిలిన మారుతి

ABN , Publish Date - Jan 07 , 2024 | 02:51 AM

విరాన్‌ ముత్తంశెటి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ముఖ్య గమనిక’. సినిమాటోగ్రాఫర్‌ వేణు మురళీధర్‌ తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు...

థ్రిల్లింగ్‌ అంశాలతో ముఖ్య గమనిక.. టీజర్ వదిలిన మారుతి

విరాన్‌ ముత్తంశెటి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ముఖ్య గమనిక’. సినిమాటోగ్రాఫర్‌ వేణు మురళీధర్‌ తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. లావణ్య కథానాయిక. రాజశేఖర్‌, సాయికృష్ణ నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్రబృందం టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. దర్శకుడు మారుతి టీజర్‌ను ఆవిష్కరించారు.

Maruthi.jpg

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా బ‌న్నీబాబు క‌జిన్ విరాన్ హీరోగా న‌టించిన ‘ముఖ్య‌ గ‌మ‌నిక’ టీజ‌ర్ చూశాను. థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందిన చిత్రమిది. విరాన్‌ కానిస్టేబుల్‌గా నటించాడు. కథ ఆసక్తికరంగా ఉంది. సినిమా సూపర్‌హిట్‌ అవ్వాలి’ అని ఆకాంక్షించారు. విరాన్‌ మాట్లాడుతూ ‘వేణు గారితో పనిచేయడం ఆనందంగా ఉంది. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘థ్రిల్లింగ్‌ అంశాలతో సాగే ఫ్యామిలీ ఎమోషన్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కించాం. మంచి కథతో వస్తున్నాం. ప్రేక్షకులు ఆదరించాలి’ అని కోరారు. నిర్మాత మాట్లాడుతూ ‘మా శివిన్‌ ప్రొడక్షన్‌లో రూపొందుతున్న తొలి చిత్రమిది. ఇప్పటికే విడుదలైన పాటలకు చక్కటి ఆదరణ వచ్చింది’ అనిచెప్పారు.

Updated Date - Jan 07 , 2024 | 01:27 PM