ముచ్చటగా మూడోసారి!

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:16 AM

నాని హీరోగా ‘జెంటిల్‌మన్‌’, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ చిత్రాలను ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నిర్మించిన శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణప్రసాద్‌ ముచ్చటగా మూడోసారి నిర్మించే చిత్రానికి సోమవారం శ్రీకారం చుట్టారు...

ముచ్చటగా మూడోసారి!

నాని హీరోగా ‘జెంటిల్‌మన్‌’, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ చిత్రాలను ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నిర్మించిన శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణప్రసాద్‌ ముచ్చటగా మూడోసారి నిర్మించే చిత్రానికి సోమవారం శ్రీకారం చుట్టారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్‌ ఇందులో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవుని ఫొటోలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు దర్శకుడు మోహనకృష్ణ సతీమణి ఉమా మహేశ్వరి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, నిర్మాత సతీమణి అనిత తొలి క్లాప్‌ ఇచ్చారు. అనంతరం నిర్మాత కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ‘మా సంస్థకి ఆత్మీయుడు, నాకు అత్యంత సన్నిహితుడు, ప్రతిభాశాలి మోహన్‌కృష్ణతో మూడో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ‘బలగం’తో హీరోగా పేరు తెచ్చుకున్న ప్రియదర్శికి ఇది యాప్ట్‌ సబ్జెక్ట్‌. తెలుగమ్మాయి రూప హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదో క్యూట్‌ ఫిల్మ్‌. స్వీట్‌ ఎంటర్‌టైన్‌. చక్కటి వినోదంతో పాటు మంచి భావోద్వేగాలు ఉంటాయి. ఈ రోజు నుంచి హైదరాబాద్‌లో షూటింగ్‌ ప్రారంభించాం’ అన్నారు. నరేశ్‌, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిశోర్‌, వైవా హర్ష, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్‌, కల్పలత, రూపలక్ష్మి, హర్షిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్య శాస్త్రి, ఫొటోగ్రఫీ: పి.జి. విందా, సంగీతం: వివేక్‌ సాగర్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: విద్య శివలెంక, లిపక ఆళ్ల, రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

Updated Date - Mar 26 , 2024 | 12:16 AM