రెండు ఫ్లాట్స్‌ కొన్న మృణాల్‌

ABN , Publish Date - Feb 21 , 2024 | 03:50 AM

‘సీతారామం’, ‘హాయ్‌ నాన్న’ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందిన బాలీవుడ్‌ భామ మృణాల్‌ ఠాకూర్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్‌’ లో నటిస్తోంది...

రెండు ఫ్లాట్స్‌ కొన్న మృణాల్‌

‘సీతారామం’, ‘హాయ్‌ నాన్న’ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందిన బాలీవుడ్‌ భామ మృణాల్‌ ఠాకూర్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్‌’ లో నటిస్తోంది. అలాగే కొన్ని బాలీవుడ్‌ చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి.. అనే పెద్దల మాటను ఆచరణలో పెడుతూ ఆమె ఇటీవల ముంబైలోని అంథేరి వెస్ట్‌లో ఓబరాయ్‌ స్ర్పింగ్స్‌ అపార్ట్‌మెంట్‌లో ఖరీదైన ఫ్లాట్లు రెండు కొనుగోలు చేసింది. ఒక్కో ఫ్లాట్‌ ఖరీదు రూ. 5 కోట్లు. ఈ రెండు ఫ్లాట్లూ కంగనా రనౌత్‌ కుటుంబ సభ్యులవే కావడం గమనార్హం. గత నెల 25న ఈ రెండు ఫ్లాట్ల రిజిస్టేషన్‌ కూడా పూర్తయింది.

Updated Date - Feb 21 , 2024 | 03:50 AM