Mr. Bachchan : యాక్షన్‌ ప్యాక్డ్‌ షెడ్యూల్‌లో మిస్టర్‌ బచ్చన్‌

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:48 AM

రవితేజ, హరీశ్‌ శంకర్‌ కాంబోలో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. ‘నామ్‌తో సునా హోగా’ అనేది ఉపశీర్షిక. భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది...

Mr. Bachchan : యాక్షన్‌ ప్యాక్డ్‌ షెడ్యూల్‌లో మిస్టర్‌ బచ్చన్‌

రవితేజ, హరీశ్‌ శంకర్‌ కాంబోలో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. ‘నామ్‌తో సునా హోగా’ అనేది ఉపశీర్షిక. భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా యాక్షన్‌ ప్యాక్డ్‌ షెడ్యూల్‌ లక్నోలో మొదలైంది. ఈ కీలక షెడ్యూల్‌లో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్‌ బ్లాక్స్‌ చిత్రానికే హైలెట్‌గా ఉండబోతున్నాయి. మునుపెన్నడూ చూడని సరికొత్త రవితేజను ఇందులో చూపించబోతున్నారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. ఈ చిత్రానికి నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్‌, సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, ఎడిటింగ్‌: ఉజ్వల్‌ కులకర్ణి, డీఓపీ: అయనంక బోస్‌, సంగీతం: మిక్కీ జే మేయర్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాశ్‌ కొల్లా.

Updated Date - Mar 27 , 2024 | 01:48 AM