తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:45 AM

సినీ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌, ముంబైకు చెందిన వ్యాపారవేత్త నికోలయ్‌ సచ్‌దేవ్‌ల వివాహం రిసెప్షన్‌ బుధవారం రాత్రి చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్లో అంగరంగ వైభవంగా జరిగింది...

వేడుకగా నటి వరలక్ష్మి వివాహ రిసెప్షన్‌

సినీ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌, ముంబైకు చెందిన వ్యాపారవేత్త నికోలయ్‌ సచ్‌దేవ్‌ల వివాహం రిసెప్షన్‌ బుధవారం రాత్రి చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ఆయన కుమారుడు మంత్రి ఉదయనిధి, మలయాళ నటుడు, కేంద్రమంత్రి సురేష్‌ గోపి, పీఎంకే అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.అన్నామలై, టీఎంసీ అధ్యక్షుడు జీకే వాసన్‌, మాజీ సీఎం ఒ.పన్నీర్‌సెల్వం, మాజీ మంత్రి డి.జయకుమార్‌, శశికళతో సహా పలువురు రాజకీయ నేతలు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్‌ నటులు శివకుమార్‌, విజయకుమార్‌, నాజర్‌, నెపోలియన్‌, ప్రభుదేవా, ఆర్య, సిద్ధార్థ్‌, జీవా, అరవింద్‌ స్వామి, గౌతం కార్తీక్‌, మోహన్‌బాబు, సుదీప్‌, జాకీ ష్రాఫ్‌, తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన బాలకృష్ణ, వెంకటేష్‌, అల్లు అరవింద్‌, సినీ నటి ఖుష్బూ, ఆండ్రియా, సుకన్య, దేవయాణి, రమ్యకృష్ణ, రోజా, సుహాసిని, సీత, సంగీత దర్శకులు దేవ, శ్రీకాంత్‌ దేవా, తమన్‌, దర్శకులు భారతీరాజా, ఎస్‌ఏ చంద్రశేఖరన్‌, మణిరత్నం, కేఎస్‌ రవికుమార్‌, పి.వాసు, బాలా, సురేష్‌ కృష్ణ, ఆర్‌కే సెల్వమణి, చేరన్‌, ఐశ్వర్య రజనీకాంత్‌, ఎ.వెంకటేశ్‌, ఏఎల్‌ విజయ్‌, అట్లీ, వసంత్‌బాలన్‌, నిర్మాతలు ఆర్‌బీ చౌదరి, ఏఎం రత్నం, ఐసరి కె.గణేష్‌తో పాటు అనేక మంది పాల్గొన్నారు. వివాహానికి ముందు జరిగిన సంగీత్‌ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, నటి త్రిష పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

చెన్నై, (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jul 05 , 2024 | 12:45 AM