మరింత ఎనర్జిటిక్‌గా ఉంటుంది

ABN , Publish Date - Mar 29 , 2024 | 03:45 AM

తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ సీక్వెల్స్‌లో ‘టిల్లు స్క్వేర్‌’ ఒకటి. ఈ చిత్రం నేడు విడుదలవుతున్న సందర్భంగా హీరో సిద్ధు జొన్నలగడ్డ మీడియాతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు...

మరింత ఎనర్జిటిక్‌గా ఉంటుంది

తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ సీక్వెల్స్‌లో ‘టిల్లు స్క్వేర్‌’ ఒకటి. ఈ చిత్రం నేడు విడుదలవుతున్న సందర్భంగా హీరో సిద్ధు జొన్నలగడ్డ మీడియాతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘‘డీజే టిల్లు విడుదల సమయంలో ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు. కానీ ఇప్పుడు సీక్వెల్‌పై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. కాబట్టే కొంచెం ఒత్తిడికి లోనయ్యాం. అయితే ఆ ఒత్తిడిని జయించి బెటర్‌ అవుట్‌పుట్‌ ఇచ్చాం. ఇందులో నా పాత్ర మొదటి భాగానికి కొనసాగింపుగా ఉంటుంది. కథ కూడా కొంత కొనసాగుతుంది. కానీ మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగంలో నా పాత్ర మరింత ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ సారి టిల్లు మరింత పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. చాలా షాక్‌లు, సర్ర్పైజ్‌లు ఉంటాయి. సినిమా అంతా నవ్వుకుంటూనే ఉంటారు. టిల్లు పాత్ర నా ఆలోచనలు, నేను చూసిన అనుభవాల నుంచి పుట్టింది. టిల్లుకి, నాకు ఒక్కటే తేడా.

టిల్లు తన మనసులో ఉన్నవన్నీ బయటకు అంటాడు. నేను మనసులో అనుకుంటాను అంతే తేడా. సీక్వెల్‌లో రాధిక పాత్ర ఉంటుందో లేదో థియేటర్లో చూసి మీరే తెలుసుకోండి. ఈ సినిమాకు భీమ్స్‌ సంగీతం ప్రత్యేకాకర్షణ. ప్రస్తుతానికి నా ఫోకస్‌ అంతా ‘టిల్లు స్క్వేర్‌’ విడుదలపైనే ఉంది. పార్ట్‌-3 కోసం కొన్ని ఐడియాస్‌ ఉన్నాయి’’ అని చెప్పారు.

Updated Date - Mar 29 , 2024 | 03:45 AM