మానవత్వాన్ని పంచే మొయినుద్దీన్ భాయ్
ABN , Publish Date - Feb 08 , 2024 | 05:33 AM
‘మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో...మానవత్వాన్ని అందరితో పంచుకో’ అంటున్నారు రజనీకాంత్. ‘లాల్ సలామ్’ చిత్రంలో మొయినుద్దీన్ భాయ్ పాత్రలో రజనీకాంత్ పలికిన డైలాగ్ ఇది...

‘మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో...మానవత్వాన్ని అందరితో పంచుకో’ అంటున్నారు రజనీకాంత్. ‘లాల్ సలామ్’ చిత్రంలో మొయినుద్దీన్ భాయ్ పాత్రలో రజనీకాంత్ పలికిన డైలాగ్ ఇది. ఈ నెల 9న ఈ చిత్రం విడుదలవుతోంది. బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. గ్రామీణ వాతావరణం, రాజకీయాలు, మతవిద్వేషాల నేపథ్యంలో సాగే కథ అని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. రజనీకాంత్ చాలా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి ఐశ్వర్య దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, క్రికెటర్ కపిల్ దేవ్ కీలకపాత్రలు పోషించారు. సుభాస్కరన్ నిర్మించారు.