మోదీ చిత్రంలో నటించడం లేదు

ABN , Publish Date - May 23 , 2024 | 06:19 AM

భారత ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌లో తను నటించడం లేదని తమిళ నటుడు సత్యరాజ్‌ స్పష్టం చేశారు. ‘ఆ సినిమా గురించి ఇంతవరకూ ఎవరూ నన్ను అడగలేదు...

మోదీ చిత్రంలో నటించడం లేదు

భారత ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌లో తను నటించడం లేదని తమిళ నటుడు సత్యరాజ్‌ స్పష్టం చేశారు. ‘ఆ సినిమా గురించి ఇంతవరకూ ఎవరూ నన్ను అడగలేదు. నిరాధారమైన ఇలాంటి వార్తలు ఎలా పుడతాయో ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా సోషల్‌ మీడియా సృష్టే. ఒకవేళ వారెవరైనా నన్ను అడిగినా ఆ చిత్రం చేయను. నేను నమ్మిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకోను’ అని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారాయన.

Updated Date - May 23 , 2024 | 06:19 AM