ఎనిమిది భాషల్లో మిషన్‌ సి

ABN , Publish Date - May 28 , 2024 | 03:38 AM

తేజేశ్వర్‌, ప్రగ్యా నయన్‌ జంటగా నటించిన ‘మిషన్‌ సి 1000’ తేజేశ్వర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎనిమిది భాషల్లో విడుదల చేయనున్నారు...

ఎనిమిది భాషల్లో మిషన్‌ సి

తేజేశ్వర్‌, ప్రగ్యా నయన్‌ జంటగా నటించిన ‘మిషన్‌ సి 1000’ తేజేశ్వర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎనిమిది భాషల్లో విడుదల చేయనున్నారు. షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. ఈ సినిమాలోని తొలి పాటను, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను నిర్మాత దిల్‌ రాజు విడుదల చేసి, యూనిట్‌కు అభినందనలు తెలిపారు. జయప్రకాశ్‌, కబీర్‌ దుహన్‌ సింగ్‌, సుధ, అనిష్‌ కురువిల్లా, కాళీచరణ్‌, సంజయ్‌ పాండే ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

Updated Date - May 28 , 2024 | 03:38 AM