మనసును మెలిపెట్టేలా...

ABN , Publish Date - Oct 24 , 2024 | 05:29 AM

శివకుమార్‌ రామచంద్రవరపు, నితిన్‌ ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. రిషికేశ్వర్‌ యోగి దర్శకత్వంలో టి.జి.విశ్వప్రసాద్‌, సుకుమార్‌ బోరెడ్డి, డాక్టర్‌ సింధు నిర్మించారు...

శివకుమార్‌ రామచంద్రవరపు, నితిన్‌ ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. రిషికేశ్వర్‌ యోగి దర్శకత్వంలో టి.జి.విశ్వప్రసాద్‌, సుకుమార్‌ బోరెడ్డి, డాక్టర్‌ సింధు నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా శివకుమార్‌ రామచంద్రవరపు, నితిన్‌ప్రసన్న మీడియాతో ముచ్చటించారు. శివకుమార్‌ రామచంద్రవరపు మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో ‘సత్య’ అనే పాత్రలో నటించాను. నటుడు కావాలనే కోరికతో మొదలెట్టిన నా పాత్ర ప్రయాణం ఎలాంటి ఆసక్తికర మలుపులు తిరిగిందనేది కథాంశం’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో నా పాత్రకు మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది. దర్శకుడు రాసిన కథ, సంభాషణలు, సృష్టించిన పాత్రలు ప్రేక్షకులను మొదటి ఫ్రేమ్‌ నుంచి చివరి ఫ్రేమ్‌ వరకు కట్టిపడేసేలా ఉంటాయి’’ అని అన్నారు నితిన్‌ ప్రసన్న.

Updated Date - Oct 24 , 2024 | 05:29 AM