మిల్లర్‌ కిల్లర్‌

ABN , Publish Date - Jan 18 , 2024 | 05:32 AM

ధనుష్‌ కథానాయకుడిగా నటించిన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘కెప్టెన్‌ మిల్లర్‌’. సంక్రాంతికి తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదలైంది. ఈ నెల 25న తెలుగు వెర్షన్‌ విడుదలవుతోంది...

మిల్లర్‌ కిల్లర్‌

ధనుష్‌ కథానాయకుడిగా నటించిన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘కెప్టెన్‌ మిల్లర్‌’. సంక్రాంతికి తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదలైంది. ఈ నెల 25న తెలుగు వెర్షన్‌ విడుదలవుతోంది. ఏషియన్‌ మల్టీప్లెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు తెలుగు హక్కులు సొంతం చేసుకున్నాయి. వెంకటేశ్‌, నాగార్జున సోషల్‌ మీడియా వేదికగా బుధవారం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ ట్రైలర్‌ను విడుదల చేశారు. బ్రిటిషర్లను తుదముట్టించే అవేశపరుడైన దేశభక్తుడిగా ధనుష్‌ సరికొత్త గెటప్పుల్లో కనిపించారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్‌ కథానాయిక. సందీప్‌ కిషన్‌, డాక్టర్‌ శివరాజ్‌కుమార్‌ కీలకపాత్రల్లో నటించారు. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో జి. శరవణన్‌, సాయి సిద్ధార్థ్‌ నిర్మించారు. సంగీతం: జీవీప్రకాశ్‌ కుమార్‌. సాయి సిద్ధార్‌ ్థ

Updated Date - Jan 18 , 2024 | 05:32 AM