మధ్యతరగతి మందహాసం
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:32 AM
సుధీర్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్‌రెడ్డి కంకర దర్శకత్వంలో సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. దసరాకి ఈ సినిమా విడుదల కానుంది...
సుధీర్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్‌రెడ్డి కంకర దర్శకత్వంలో సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. దసరాకి ఈ సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. మధ్యతరగతి యువకుడి పాత్ర పోషిస్తున్న సుధీర్‌బాబు స్కూటర్ నడుపుతూ చిరునవ్వుతో స్కూల్ పిల్లలను పలకరిస్తూ కనిపించారు. ప్రేమ, అనుబంఽధాలకు అర్థం చెప్పే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. ఈ నెల 12న టీజర్ విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. ఆర్ణ ఈ సినిమాలో కథానాయిక.