గుర్తుండి పోయే జ్ఞాపకాలు
ABN , Publish Date - Oct 19 , 2024 | 06:34 AM
విజయ్‌దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (వీడీ 12- వర్కింగ్ టైటిల్)
విజయ్‌దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (వీడీ 12- వర్కింగ్ టైటిల్) షూటింగ్ ప్రస్తుతం కేరళలో శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా విజయ్ కేరళ అభిమానులతో భేటీ అయ్యారు. ‘కేరళలో షూటింగ్ మరచిపోలేని అనుభూతులు ఇచ్చింది. ఈ జ్ఞాపకాలు ఎన్నేళ్లైనా గుర్తుండిపోతాయి. ప్రకృతి అందాల మధ్య గడిపిన క్షణాలు నాకెంతో ప్రత్యేకం. ఈ సినిమా ప్రేక్షకుల మనసులను చూరగొంటుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. కేరళ అభిమానులతో విజయ్ ముచ్చటిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ చిత్రంలో విజయ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ‘వీడీ 12’ ప్రేక్షకుల ముందుకు రానుంది.