మెలోడీ మహాలక్ష్మి

ABN , Publish Date - Mar 11 , 2024 | 03:19 AM

‘కేరింత’ ఫేమ్‌ పార్వతీశం హీరోగా, ప్రణీకాన్విక కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్‌ మహాలక్ష్మి’. వీఎస్‌ ముఖేశ్‌ యువ దర్శకత్వంలో అఖిలేశ్‌ కలారు నిర్మిస్తున్నారు...

మెలోడీ మహాలక్ష్మి

‘కేరింత’ ఫేమ్‌ పార్వతీశం హీరోగా, ప్రణీకాన్విక కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్‌ మహాలక్ష్మి’. వీఎస్‌ ముఖేశ్‌ యువ దర్శకత్వంలో అఖిలేశ్‌ కలారు నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్‌, ముక్కు అవినాష్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కూ, కూరగాయల దుకాణం నడిపే యువతికి మధ్య జరిగే ప్రేమకథతో ఈ చిత్రం రూపొందుతోంది. ‘మార్కెట్‌ మహాలక్ష్మి’ నుంచి ‘సాఫ్ట్‌వేర్‌ పోరగా’ అంటూ సాగే గీతాన్ని మేకర్స్‌ విడుదల చేశారు. వీఎస్‌ ముఖేశ్‌ సాహిత్యానికి జోఎన్‌ మవ్‌ గ్రూవీ స్వరాలు సమకూర్చారు. లోకేశ్వర్‌ ఆలపించారు.

Updated Date - Mar 11 , 2024 | 03:19 AM