ఫైట్స్‌లోనూ మెగాస్టారే

ABN , Publish Date - Mar 18 , 2024 | 06:48 AM

కసి, కృషి కలగలసిన వ్యక్తిత్వం చిరంజీవి సొంతం. యువతను ఉర్రూతలూగించే డ్యాన్స్‌లు చేసినా, మాస్‌ను మైమరపించే ఫైట్స్‌ చేసినా ఆయన నమ్ముకున్నది తన కష్టాన్నే. దీనికి నిదర్శనంగా నిలిచే...

ఫైట్స్‌లోనూ మెగాస్టారే

కసి, కృషి కలగలసిన వ్యక్తిత్వం చిరంజీవి సొంతం. యువతను ఉర్రూతలూగించే డ్యాన్స్‌లు చేసినా, మాస్‌ను మైమరపించే ఫైట్స్‌ చేసినా ఆయన నమ్ముకున్నది తన కష్టాన్నే. దీనికి నిదర్శనంగా నిలిచే సంఘటన ‘విశ్వంభర’ సెట్స్‌లో మరోసారి ఆవిష్కృతమైంది. చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇటీవలే మొదలైన తాజా షెడ్యూల్‌లో భారీ పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా రిస్కీ ఫైట్స్‌ అనగానే చాలామంది హీరోలు పక్కకు తప్పుకొని డూప్‌ను పెడతారని చెబుతుంటారు. కానీ చిరంజీవి మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. ఈ వయసులోనూ అత్యంత కష్టమైన యాక్షన్‌ సీక్వెన్స్‌లోనూ స్వయంగా పాల్గొంటున్నారు. తాళ్లతో బంధించి గాల్లోకి లేపడం, రాతి నేల పైన స్టంట్స్‌ చేయడం వల్ల ఒళ్లు హూనమౌతున్నా పంటి బిగువున భరిస్తున్నారు తప్ప డూప్‌ను మాత్రం వాడడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ వయసులో కూడా ఆయన అలా కష్టపడడం చూసి సెట్‌లో జనాలు ఆశ్చర్యపోతున్నారట. హిట్‌ కొట్టాలనే పట్టుదల, వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత అలాంటిది మరి. సోషియో సైన్స్‌ ఫాంటసీగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో వీఎ్‌ఫఎక్స్‌ పార్ట్‌ అధికంగా ఉంటుంది. వచ్చే సంక్రాంతికి ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Mar 18 , 2024 | 06:48 AM