మరోసారి మెగాఫోన్
ABN , Publish Date - Sep 20 , 2024 | 01:22 AM
ధనుష్ తాను కీలకపాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహించిన ‘రాయన్’ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు మరోసారి ఆయన ఓ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు మెగాఫోన్ పట్టారు...
ధనుష్ తాను కీలకపాత్రలో నటిస్తూ, దర్శకత్వం వహించిన ‘రాయన్’ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు మరోసారి ఆయన ఓ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు మెగాఫోన్ పట్టారు. డాన్‌పిక్చర్స్, వండర్‌బార్ ఫిల్మ్స్ బేనర్‌పై ఆకాశ్ భాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఇడ్లీ కడై’ అనే ఆసక్తికర టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇడ్లీ బండి దగ్గర పిల్లలు నిల్చున్న పోస్టర్‌ను విడుదల చేశారు. ధనుష్‌కు దర్శకుడిగా ఇది నాలుగో చిత్రం. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: కిరణ్ కౌశిక్.