వచ్చే సంక్రాంతికి మెగా ధమాకా

ABN , Publish Date - Jan 17 , 2024 | 06:16 AM

చిరంజీవి అభిమానులకు సంక్రాంతి సందర్భంగా డబుల్‌ ధమాకా ఇచ్చారు. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం (మెగా 156-వర్కింగ్‌ టైటిల్‌) టైటిల్‌...

వచ్చే సంక్రాంతికి మెగా ధమాకా

చిరంజీవి అభిమానులకు సంక్రాంతి సందర్భంగా డబుల్‌ ధమాకా ఇచ్చారు. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం (మెగా 156-వర్కింగ్‌ టైటిల్‌) టైటిల్‌, రిలీజ్‌ డేట్‌ ఖరారయ్యాయి. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా సోమవారం విడుదల చేసిన ప్రత్యేక వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫాంటసీ అడ్వంచర్‌గా వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని భారీ హంగులతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ఛోటా కె నాయుడు.

Updated Date - Jan 17 , 2024 | 06:17 AM