మెకానిక్‌ సందేశం

ABN , Publish Date - Feb 01 , 2024 | 02:49 AM

మణిసాయి తేజ, రేఖా నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్‌’. ముని సహేకర దర్శకత్వంలో ఎం నాగమునెయ్య నిర్మించారు. ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ‘మెకానిక్‌’ ట్రైలర్‌ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి...

మెకానిక్‌ సందేశం

మణిసాయి తేజ, రేఖా నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్‌’. ముని సహేకర దర్శకత్వంలో ఎం నాగమునెయ్య నిర్మించారు. ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ‘మెకానిక్‌’ ట్రైలర్‌ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా చిత్రబృందం ఆవిష్కరించింది. ఫ్లోరైడ్‌ బాధిత ప్రజల జీవితాలే ఇతివృత్తంగా తెరకెక్కిన ‘మెకానిక్‌’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నిర్మాత మాట్లాడుతూ ‘మంచి సినిమా తీశాం. సందేశంతో పాటు వాణిజ్య హంగులూ ఉన్నాయ’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మా నిర్మాతల ధైర్యం వల్లే మంచి సినిమా తీయగలిగాం. సిద్‌ శ్రీరాం ఓ పాట పాడారు. తనికెళ్ల భరణి గారి సహకారం మరువలేనిద’న్నారు.

Updated Date - Feb 01 , 2024 | 02:49 AM