రెండింతల వినోదం

ABN , Publish Date - Sep 09 , 2024 | 05:26 AM

శ్రీసింహ కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా నటించిన చిత్రం ‘మత్తు వదలరా 2’. నితేష్‌ రాణా దర్శకత్వంలో చిరంజీవి, హేమలత నిర్మించారు. ఈ నెల 12న సినిమా విడుదలవుతోంది.

శ్రీసింహ కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా నటించిన చిత్రం ‘మత్తు వదలరా 2’. నితేష్‌ రాణా దర్శకత్వంలో చిరంజీవి, హేమలత నిర్మించారు. ఈ నెల 12న సినిమా విడుదలవుతోంది. ఆదివారం మేకర్స్‌ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నితేష్‌ రాణా మాట్లాడుతూ ‘‘మర్డర్‌ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ ఇది. అందరినీ విపరీతంగా నవ్విస్తుంది. మొదటి భాగం కంటే రెండింతల వినోదంతో వస్తున్నాం’’ అని చెప్పారు.

Updated Date - Sep 09 , 2024 | 05:26 AM