మస్తు షేడ్స్‌ ఉన్నాయ్‌రా..

ABN , Publish Date - Jan 24 , 2024 | 12:34 AM

Are there any Mastu shades?

మస్తు షేడ్స్‌ ఉన్నాయ్‌రా..

కమెడియన్‌ అభినవ్‌ గోమఠం హీరోగా మారాడు. ఆయన హీరోగా ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నాయ్‌రా’ అనే పేరుతో సినిమా రానుంది. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో అభినవ్‌ చెప్పిన పాపులర్‌ డైలాగ్‌ ఇది. అదే హీరోగా అతని తొలి సినిమా టైటిల్‌కి కావడం విశేషం. వైశాలీ రాజ్‌ హీరోయిన్‌. తిరుపతిరావు ఇండ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. భవాని కాసుల, ఆరెమ్‌ రెడ్డి, ప్రశాంత్‌.వి నిర్మాతలు. ఈ సినిమా టైటిల్‌ లోగోను దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ ఆవిష్కరించారు. నటుడిగా అభినవ్‌ గోమఠంలోని కొత్తకోణాన్ని ఇందులో చూస్తారని, అన్ని ఉద్వేగాలూ ఈ సినిమాలో ఉంటాయని, వచ్చేనెల ద్వితీయార్థంలో సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. తరుణ్‌భాస్కర్‌, అలీ రేజా, మొయిన్‌, చక్రపాణి ఆనంద్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సిద్దార్థ్‌ స్వయంభూ, కథ, అన్వర్‌ సాథిక్‌, మాటలు: రాధామోహన్‌ గుంటి, సంగీతం: సంజీవ్‌ టి.

Updated Date - Jan 24 , 2024 | 12:34 AM