Marrichettu Kinda Manollu: ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’కు బాబు మోహన్ బ్లెస్సింగ్స్
ABN , Publish Date - Dec 22 , 2024 | 08:39 PM
మర్రి చెట్టు తెలియని వారు ఉండరు. జీవితంలో ప్రతి ఒక్కరికి మర్రిచెట్టుతో జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటి మర్రి చెట్టు కాన్సెఫ్టుతో టాలీవుడ్‌లో ఇప్పుడో సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. ఆ వివరాల్లోకి వెళితే..
శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో.. ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం, ముస్కాన్ రాజేందర్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’. ఈ మూవీ సారథి స్టూడియోలో ఆదివారం పూజా కార్యక్రమలతో ప్రారంభమైంది. చిత్ర ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు బాబు మోహన్ నటీనటులపై క్లాప్ కొట్టారు. ఆర్టిస్టు నాగ మహేష్ కెమెరా స్విఛాన్ చేశారు. థర్టీ ఇయర్స్ పృథ్వీ, రాజీవ్ కనకాల, తెలుగు ఫిలించాంబర్ అధ్యక్షలు దామోదర ప్రసాద్, నిర్మాత సి కళ్యాణ్, టీఎంఏఏ ప్రెసిడెంట్ రష్మీ ఠాగుర్ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read-Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఈ ట్విస్టేంటి?
ఈ సందర్బంగా నటుడు బాబు మోహన్ మాట్లాడుతూ.. ఈ సినిమా బ్యానర్, టైటిల్, డైరెక్టర్.. ఇలా అన్నీ పవర్ ఫుల్‌గానే ఉన్నాయి. బ్యానర్ నారసింహుడి పవర్‌ఫుల్ రూపాన్ని చూపించడం సినిమాపై పాజిటివిటీని పెంచుతుంది. ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’ చాలా మంచి టైటిల్. నేను కూడా ఈ సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నమ్మకం ఉంది. చిత్రయూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి నా తోటి సీనియర్ నటుడు బాబు మోహన్ వంటి వారితో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు థర్టీ ఇయర్స్ పృథ్వీ.
చిత్ర దర్శకుడు నరేష్ వర్మ ముద్దం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరినీ అలరించే విధంగా ఒక మంచి సబ్జెక్టుతో చేస్తున్న చిత్రమిది. ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’ టైటిల్‌కు మంచి స్పందన వస్తోంది. ప్రారంభానికి ముందే ఈ సినిమా జనాల్లోకి వెళ్లిపోవడం సంతోషంగా ఉంది. ఈ సినిమాను సపోర్టు చేసి, ఆదరించాలని అందరిని కోరుకుంటున్నానని అన్నారు. సహనిర్మాతలు ఆకుల రిషేంద్ర నరసయ్య, బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘యువతకు సరైన దిశా నిర్దేశం చేసే సబ్జెక్ట్ ఇది. ఇప్పటికే ఈ సినిమా పబ్లిక్‌లోకి వెళ్ళిపోయింది. మర్రి చెట్టు తెలియని వారు ఉండరు. జీవితంలో ప్రతి ఒక్కరికి మర్రిచెట్టుతో జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటి మర్రి చెట్టు కాన్సెఫ్టుతో రానున్న ఈ సినిమా అందరిని అలరించడం ఖాయం. ఇండస్ట్రీలో ఒక మంచి సినిమాగా నిలబడే దమ్మున్న సబ్జెక్టు ఇది. సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులందరికి ధన్యవాదాలని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోలు, హీరోయిన్లు ప్రసంగించారు.