డిసెంబర్ నాలుగున వివాహం
ABN , Publish Date - Oct 31 , 2024 | 02:02 AM
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహ ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ నాలుగున వీరిద్దరూ వివాహం చేసుకోనున్నట్లు అక్కినేని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు 8న...
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహ ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ నాలుగున వీరిద్దరూ వివాహం చేసుకోనున్నట్లు అక్కినేని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు 8న నాగచైతన్య, శోభితల నిశ్చితార్థం జరిగింది. అప్పట్లో పెళ్లి తేదీని ప్రకటించకపోయినప్పటికీ డిసెంబర్‌లో వివాహం ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. సరిగ్గా వారం రోజుల క్రితం శోభిత పెళ్లి పనులు మొదలయ్యాయని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దాంతో త్వరలోనే వీరి వివాహం ఉంటుందని అందరూ అనుకుంటున్న తరుణంలో చిత్రజ్యోతి ఈ విషయమై అక్కినేని కుటుంబ సభ్యులను సంప్రదించగా వారు ఽఈ వార్తను ధ్రువీకరించారు.