కాలం ఏదైనా మార్మోగే పేరు కంగువ

ABN , Publish Date - Jan 17 , 2024 | 06:12 AM

సూర్య కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘కంగువ’. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ ప్రతిష్ఠాత్మికంగా నిర్మిస్తున్నాయి. దిశాపటానీ కథానాయిక. శివ దర్శకుడు. మొత్తం పదికి పైగా భాషల్లో విడుదల చేస్తున్నారు...

కాలం ఏదైనా మార్మోగే పేరు కంగువ

సూర్య కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘కంగువ’. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ ప్రతిష్ఠాత్మికంగా నిర్మిస్తున్నాయి. దిశాపటానీ కథానాయిక. శివ దర్శకుడు. మొత్తం పదికి పైగా భాషల్లో విడుదల చేస్తున్నారు. త్రీడీ లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా చిత్రబృందం ‘కంగువ’ సెకండ్‌ లుక్‌ను రిలీజ్‌ చేసింది. చారిత్రక నేపథ్యంలో కాల్పనిక గాథతో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో సూర్య యుద్ధ వీరుని లుక్‌లో మెరిశారు. ‘గతం, వర్తమానం, భవిష్యత్‌... కాలం ఏదైనా నలుదిక్కులా మార్మోగే పేరు ఒక్కటే ‘కంగువ’... అంటూ సూర్య లుక్‌కు మేకర్స్‌ ఇచ్చిన క్యాప్షన్‌ను బట్టి సూర్య పాత్ర ఇందులో ఎంత శక్తిమంతంగా ఉండబోతోందో తెలుస్తోంది. బాబీ డియోల్‌, యోగిబాబు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి

Updated Date - Jan 17 , 2024 | 06:12 AM