కొత్త పాయింట్‌తో మార్కెట్‌ మహాలక్ష్మి

ABN , Publish Date - Apr 17 , 2024 | 02:51 AM

‘కేరింత’ మూవీ సినిమాలో కామెడీ టైమింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు పార్వతీశం. ఆయన నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మార్కెట్‌ మహాలక్ష్మి’. ప్రణీకాన్వికా హీరోయిన్‌గా నటించారు...

కొత్త పాయింట్‌తో మార్కెట్‌ మహాలక్ష్మి

‘కేరింత’ మూవీ సినిమాలో కామెడీ టైమింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు పార్వతీశం. ఆయన నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘మార్కెట్‌ మహాలక్ష్మి’. ప్రణీకాన్వికా హీరోయిన్‌గా నటించారు. వియస్‌ ముఖేశ్‌ దర్శకత్వం వహించగా, అఖిలేశ్‌ కిలారు నిర్మించారు. ఈ నెల 19న ‘మార్కెట్‌ మహాలక్ష్మి’ విడుదలవుతోన్న సందర్భంగా చిత్ర దర్శకుడు మీడియాతో ముచ్చటించారు. ‘‘ఈ సినిమాలో ఆడియెన్స్‌ ఇప్పటివరకు చూడని ఓ కొత్త పాయింట్‌ను టచ్‌ చేశాం. ప్యూర్‌ లవ్‌ స్టోరీతో వస్తోన్న ఈ సినిమాను కుటుంబసమేతంగా చూసేలా తెరకెక్కించాం. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేసే నా ఫ్రెండ్‌ ఒకరు కూరగాయలు అమ్మే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ సంఘటన స్ఫూర్తితో ఈ సినిమా కథను రాసుకున్నాను’’ అని చెప్పారు.

Updated Date - Apr 17 , 2024 | 02:51 AM