మన్నారా చోప్రా మాస్‌ సాంగ్‌

ABN , Publish Date - Jun 25 , 2024 | 12:46 AM

బాలీవుడ్‌ సంచలనం మన్నారా చోప్రా ‘తిరగబడరా సామీ’ చిత్రంలో ఓ విభిన్న పాత్ర పోషిస్తున్నారు. రాజ్‌తరుణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మాల్వి మల్హోత్రా కథానాయిక...

మన్నారా చోప్రా మాస్‌ సాంగ్‌

బాలీవుడ్‌ సంచలనం మన్నారా చోప్రా ‘తిరగబడరా సామీ’ చిత్రంలో ఓ విభిన్న పాత్ర పోషిస్తున్నారు. రాజ్‌తరుణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మాల్వి మల్హోత్రా కథానాయిక. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. యూత్‌ని ఆకట్టుకొనే రొమాన్స్‌తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్‌, హై ఓల్జేజ్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా మన్నారా పై చిత్రీకరించిన ‘రాధాభాయ్‌’ పాటను విడుదల చేశారు. సంగీత దర్శకుడు బోలే షావలి రచించి, స్వరపరిచిన ఈ మాస్‌ సాంగ్‌ను శ్రావణ భార్గవి పాడారు. ఇందులో మన్నారా డ్యాన్స్‌ మూమెంట్స్‌ చూసి ఆడియన్స్‌ చిందులు వేయడం ఖాయం అంటున్నారు నిర్మాత.

Updated Date - Jun 25 , 2024 | 12:46 AM