మళ్లీ మనీషా చిత్రం!

ABN , Publish Date - Feb 13 , 2024 | 06:02 AM

‘మాయలోడు’, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ ‘యమలీల’, ‘వినోదం’ వంటి వినోదాత్మక చిత్రాలను ప్రేక్షకులకు అందించిన మనీషా సంస్థ అధినేత కిశోర్‌ రాఠి చాలా కాలం గ్యాప్‌ తర్వాత మళ్లీ చిత్ర నిర్మాణానికి...

మళ్లీ మనీషా చిత్రం!

‘మాయలోడు’, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ ‘యమలీల’, ‘వినోదం’ వంటి వినోదాత్మక చిత్రాలను ప్రేక్షకులకు అందించిన మనీషా సంస్థ అధినేత కిశోర్‌ రాఠి చాలా కాలం గ్యాప్‌ తర్వాత మళ్లీ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శ్రీహర్ష, కషిక కపూర్‌ హీరో హీరోయిన్లుగా ఆయన నిర్మించే ‘లవ్‌ యువర్‌ ఫాదర్‌’ చిత్రం షూటింగ్‌ సోమవారం మల్లారెడ్డి కాలేజీలో ప్రారంభమైంది. వవన్‌ కేతరాజు ఈ చిత్రానికి దర్శకుడు. హీరో శ్రీహర్ష, గాయకుడు ఎస్పీ చరణ్‌పై చిత్రీకరించిన తొలి షాట్‌కు సీఎంఆర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ గోపాలరెడ్డి క్లాప్‌ ఇవ్వగా, కామకూర శాలిని కెమెరా స్విచ్‌ఆన్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన మహేశ్‌ రాఠి మాట్లాడుతూ ‘తండ్రీకొడుకుల మధ్య ఉండే బంధాన్ని, ఎమోషన్‌ను చూపించే సినిమా ఇది. మణిశర్మగారు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. మా నాన్నగారి ఆశీస్సులతో ఈ సినిమా నిర్మిస్తున్నాను’ అన్నారు. మల్లారెడ్డి కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ ఎ.రామస్వామి రెడ్డి మాట్లాడుతూ మా అబ్బాయి శ్రీహర్షను హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. సినిమాలో అన్ని రకాల ఎలిమెంట్స్‌ ఉంటాయి. వినోదాత్మకంగా కూడా ఉండే ఈ సినిమా సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నా’ అన్నారు. దర్శకుడు పవన్‌ కేతరాజు మాట్లాడుతూ ‘ఎన్నో హిట్‌ చిత్రాలు అందించిన మనీషా సంస్థలో పని చేయడం ఆనందంగా ఉంది. మా నిర్మాత కిశోర్‌ రాఠి జీవితంలో జరిగిన ఓ సంఘటన తీసుకుని కథని తయారు చేశాం. తండ్రీ కొడుకుల ఎమోషనల్‌ జర్నీ ఈ సినిమా’ అన్నారు. నవాబ్‌ షా, ప్రవీణ్‌, భద్రం, అంజన్‌ శ్రీవాస్తవ్‌, అమన్‌ వేమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: మణీంద్ర కుమార్‌, సంగీతం: మణిశర్మ, నిర్మాతలు: కిశోర్‌ రాథి, హేశ్‌ రాఠి, అన్నపురెడ్డి సామ్రాజ్యలక్ష్మి.

Updated Date - Feb 13 , 2024 | 06:02 AM